సింగిల్ షెడ్యూల్ లో శ్యామ్ సింగ రాయ్ షూట్ ను పూర్తి చేయనున్న నాని

సింగిల్ షెడ్యూల్ లో శ్యామ్ సింగ రాయ్ షూట్ ను పూర్తి చేయనున్న నాని
సింగిల్ షెడ్యూల్ లో శ్యామ్ సింగ రాయ్ షూట్ ను పూర్తి చేయనున్న నాని

న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమాను పూర్తి చేసాడు. ఈ సినిమా విడుదల కంటే ముందే కరోనా సెకండ్ వేవ్ రావడంతో వాయిదా వేయక తప్పలేదు. ఇక నాని నటిస్తోన్న మరో సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా షూటింగ్ మరో 40 రోజుల పాటు జరగాల్సి ఉంది.

నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇది. రాహుల్ సంకిట్ర్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై మొదటి వారం నుండి శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ తిరిగి మొదలుకానుంది. మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేయాలని నాని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోనే భారీ సెట్స్ వేస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ ను ఆగష్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాడు నాని.