మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ ను నాని హోల్డ్ లో పెట్టాడా?

మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ ను నాని హోల్డ్ లో పెట్టాడా?
మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ ను నాని హోల్డ్ లో పెట్టాడా?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ లో ఉంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగుస్తుంది. ఇక ఈ సినిమా పూర్తవ్వగానే ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా నాని తన నెక్స్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ ను మొదలుపెడతాడని అందరూ భావించారు. దానికి తగ్గట్లుగా పనులు జరిగాయి కూడా.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నాని హోల్డ్ లో పెడుతున్నాడట. మొదటినుండి శ్యామ్ సింగ రాయ్ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది కానీ వారు వెనక్కి తగ్గడంతో వెంకట బోయినపల్లి చేతికి వెళ్ళింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి.

అయితే శ్యామ్ సింగ రాయ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాల్సిన సినిమా. ప్రస్తుతమున్న మార్కెట్ వేల్యూకు ఈ సినిమా తెరకెక్కించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాలని నాని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.