నాని రిజెక్ట్ చేసిన సినిమా అది


హీరో నాని టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ చేయడానికి ఉత్సాహం చూపించాడు కానీ ఎక్కడో తేడా కొట్టింది దాంతో ఆ సినిమాని రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే ఇప్పుడు అదే చిత్రాన్ని యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేయడానికి ముందుకు వచ్చాడు . 1980 – 90 కాలంలో స్టూవర్టుపురం గజదొంగ గా సంచలనం సృష్టించిన వ్యక్తి ఈ టైగర్ నాగేశ్వర్ రావు . ఇక ఈ చిత్రానికి సూపర్ హిట్ టైటిల్” గజదొంగ ” అని పెట్టుకున్నారు .

దొంగాట , కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ ఈ గజదొంగ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . టైగర్ నాగేశ్వర్ రావు అనే చిత్రాన్ని చేయడానికి ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నాడు పాపం ఈ దర్శకుడు కానీ కాలం కలిసి రావడం లేదు . బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న ఈరోజుల్లో గజదొంగ తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు . ఇక నాని రిజెక్ట్ చేసిన ఈ సినిమాని బెల్లంకొండ చేస్తున్నాడు . అయితే బెల్లంకొండ కు ఇప్పటి వరకు కమర్షియల్ హిట్టే లేదు పాపం . ఈ గజదొంగ ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గజదొంగ గా మెప్పిస్తాడా ? చూడాలి .