గ్యాంగ్ లీడర్ ని పూర్తిచేయాలన్న కసితో ఉన్నాడట నాని


నాని కి స్వల్ప గాయాలు అయినప్పటికీ గ్యాంగ్ లీడర్ ని అనుకున్నట్లుగానే పూర్తిచేయాలని కసిగా ఉన్నాడట నాని . ఇటీవలే నాని కి గ్యాంగ్ లీడర్ షూటింగ్ లో కాలుకి గాయం అయిన విషయం తెలిసిందే . దాంతో డాక్టర్లు కొద్దిరోజులు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు . తగిలిన గాయం కూడా చిన్నదే కావడంతో గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లుగా ఆగస్టు 30 న విడుదల చేయాల్సిందే అని డిసైడ్ అయ్యాడట నాని .

ఆగస్టు 30 న విడుదల చేయాలంటే మిగతా బ్యాలెన్స్ గా ఉన్న షూటింగ్ కంప్లీట్ చేయాలి . ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తికావడంతో ఈనెల 8 నుండి జూలై 5 వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ చేయాలనీ దాంతో కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నారట . అలా చేస్తేనే ఆగస్టు 30 న గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అవుతుంది మరి . నాని సరసన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ నటిస్తుండగా ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు .