నాని గ్యాంగ్ లీడర్ టీజర్ టాక్


విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ” గ్యాంగ్ లీడర్ ” . నాని హీరోగా నటిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది . ఇక ఈ గ్యాంగ్ లీడర్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు , కాగా ఆ టీజర్ ఎలా ఉందంటే ……. ప్రేక్షకులను అలరించేలాగే ఉంది గ్యాంగ్ లీడర్ టీజర్ .

మంచి హాస్యంతో ఉంది ఈ టీజర్ , అయితే గ్యాంగ్ మాత్రం లేడీ గ్యాంగ్ కావడం విశేషం . ఈ చిత్రాన్ని ఆగస్టు 30 న విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు . అయితే అదే రోజున ప్రభాస్ నటించిన సాహో విడుదల అవుతున్న నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని వాయిదా వేస్తారేమో చూడాలి . ఎందుకంటే సాహో చిత్రంతో పోటీ పడితే నాని చిత్రానికి ఇబ్బందులు తప్పవు మరి .