నాని ని దెబ్బకొట్టిన రెండు సినిమాలు


నాని ని దెబ్బకొట్టిన రెండు సినిమాలు
నాని

నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం సూపర్ హిట్ కాకుండా రెండు సినిమాలు దెబ్బకొట్టాయి . జెర్సీ చిత్రం విడుదలైన రోజునే రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 రిలీజ్ అయ్యింది . జెర్సీ చిత్రానికి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రావడం లేదు . జెర్సీ వసూళ్ల కు కాంచన 3 అడ్డుపడింది . ఒకవైపు కాంచన 3 వసూళ్లు వీర లెవల్లో సాధిస్తుంటే జెర్సీ మాత్రం చతికిల బడిపోయింది .

కాకపోతే నాని నటనకు గాను ప్రశంసల వర్షం కురుస్తోంది . అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి . జెర్సీ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుతున్నారు కానీ పాపం వసూళ్లు మాత్రం కట్టబెట్టడం లేదు . కాంచన 3 పరిస్థితి అలా ఉంటే ఇది చాలదన్నట్లు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా నాని జెర్సీ వసూళ్ల ని దెబ్బ కొట్టింది . ఎవెంజర్స్ మేనియా మాములుగా లేదు దాంతో జెర్సీ ని పట్టించుకోవడం మానేశారు ప్రేక్షకులు .