నాని రిస్క్ చేస్తున్నాడా


nani says its not risk

నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం రేపు విడుదల అవుతోంది అయితే చరణ్ నటించిన రంగస్థలం చిత్రం అన్ని థియేటర్ లలో ఇంకా బాగా ఆడుతోంది ఈ పరిస్థితుల్లో నాని కృష్ణార్జున యుద్ధం చిత్రం విడుదల రిస్క్ అని కొందరు అంటుంటే నాని మాత్రం ఇది రిస్క్ కానేకాదు పైగా రంగస్థలం సక్సెస్ నాకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కొంతకాలంగా సరైన సినిమా లేక ప్రేక్షకులు థియేటర్ లకు రావడం లేదు సరిగ్గా అలాంటి సమయంలో రంగస్థలం కోసం జనాలు థియేటర్ లకు వస్తున్నారు కాబట్టి ఇదే సమయంలో మా సినిమా వస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుందనే రిలీజ్ చేస్తున్నాం అని సరికొత్త విశ్లేషణ చేస్తున్నాడు నాని .

నాని సినిమా బాగుంటే తప్పకుండా చూస్తారు లేకపోతె చూడటం మానేస్తారు . మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు . రేపు కృష్ణార్జున యుద్ధం చిత్రం విడుదల అవుతుండగా ఓవర్ సీస్ లో మాత్రం కాస్త ముందుగానే అంటే ఈరోజు షోలు పడిపోనున్నాయి .