సారీ చెప్పిన నాని


హీరో నాని సారీ చెప్పాడు , అది తన కొడుకు అర్జున్ కు సారీ చెప్పాడు . ఇంతకీ నాని చేసిన తప్పేంటో తెలుసా …… తన కొడుకు పేరుని దొంగిలించడం ! అంటే జెర్సీ చిత్రంలో నాని క్యారెక్టర్ పేరు ” అర్జున్ ” దాంతో నా పేరు దొంగిలించాడు అని ఓ టీ షర్ట్ వేసుకుని కూర్చోగా అందుకు నాని తక్కువేం తినలేదు సారీ రా …. తప్పలేదు అంటూ రాసుకొచ్చాడు .

ఇంతకీ ఈ డ్రామా ఏంటంటే జెర్సీ చిత్ర ప్రమోషన్ కోసమే ! జెర్సీ చిత్రంలో అర్జున్ గా క్రికెట్ ప్లేయర్ గా నటిస్తున్నాడు నాని . రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇలా అటెన్షన్ కొట్టేయడానికి ప్లాన్ చేసాడు నాని . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కన్నడ భామ శ్రద్దా శ్రీనాద్ హీరోయిన్ గా నటించింది . అనిరుద్ సంగీతం అందించిన జెర్సీ చిత్ర ఫలితం ఎలా ఉంటుందో రేపు తెలిసిపోనుంది .