శ్రీ రెడ్డి కి బర్త్ డే గిఫ్ట్ పంపిన నాని


nani sends birthday gift to sri reddy

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పుట్టినరోజు ఈరోజు దాంతో నిన్న సాయంత్రమే శ్రీ రెడ్డి కి బర్త్ డే గిఫ్ట్ పంపించాడు హీరో నాని . శ్రీ రెడ్డి – నాని ల మధ్య యుద్ధం జరుగుతుంటే నాని ఆమెకు గిఫ్ట్ పంపడం ఏంటి అని అనుకుంటున్నారా ? శ్రీ రెడ్డి కొద్దిరోజులుగా అదేపనిగా నాని పై విమర్శలు చేస్తోంది దాంతో నా సహనం నశించిపోయింది అంటూ లీగల్ నోటీసులు పంపాడు నాని అదే ఆమె కు గిఫ్ట్ అన్నమాట .

”నా సహనానికి కూడా హద్దు ఉంటుంది , అదేపనిగా విమర్శలు చేస్తే స్పందించాల్సిన అవసరం లేదు …… లీగల్ నోటీసులు పంపించా పరువు నష్టం దావా కింద , ఇకపై ఈ విషయంపై మళ్ళీ మళ్ళీ మాట్లాడి సమయం వృథా చేసుకోదలచుకోలేదు . అందరికీ కుటుంబాలు ఉంటాయి తప్పుడు ఆరోపణలు స్ప్రెడ్ కావడం ఎవరికీ మంచిది కాదు ” అంటూ ట్వీట్ చేసాడు నాని . చాలారోజులుగా శ్రీ రెడ్డి నాని పై విమర్శలు చేస్తూనే ఉంది దాంతో సహనం నశించిన నాని లీగల్ గా ప్రొసీడ్ అయ్యాడు అయితే శ్రీ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు .