నాని స్పీడ్ మాములుగా లేదుగా

నాని స్పీడ్ మాములుగా లేదుగా
నాని స్పీడ్ మాములుగా లేదుగా

న్యాచురల్ స్టార్ నాని గత కొంత కాలం నుండి కన్సిస్టెంట్ గా సంవత్సరానికి రెండు నుండి మూడు సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా నాని సినిమాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేయడం నానికి పరిపాటిగా మారింది. గతేడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు చేసిన నాని ఈ ఏడాది V ను పూర్తి చేసాడు. ఇందులో నాని నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా నాని కెరీర్ లో 25వ సినిమా. తన కెరీర్ కు ఈ చిత్రం చాలా స్పెషల్ గా నిలుస్తుందని భావిస్తున్నాడు.

ఇది కాకుండా నాని అప్పుడే టక్ జగదీశ్ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశాడు. టక్ జగదీష్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షూటింగ్ ఇటీవలే మొదలైంది. శరవేగంగా జరుగుతోంది.

జులై 3న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. టక్ జగదీశ్ విడుదల కాకుండానే నాని తన నెక్స్ట్ సినిమాను కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండనుంది. నాని కెరీర్ లో మరో భిన్నమైన సినిమాగా ఇది నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా మరో రెండు నెలల్లో పట్టాలెక్కనుంది. ఈ ఏడాదే లేకపోతే వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.

దీంతో పాటు నాని నిర్మాతగా కూడా బిజీగా వ్యవహరిస్తున్నాడు. నాని రీసెంట్ గా నిర్మించిన హిట్ ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమా నిర్మితమైంది. హిట్ సినిమా కనుక విజయం సాధిస్తే మరిన్ని సినిమాల్ని నిర్మించాలని నాని భావిస్తున్నాడు. అయితే తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా ద్వారా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే చూస్తున్నాడు. మరి ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తాడన్నది చూడాలి.