కొత్త సినిమాలను సైన్ చేస్తోన్న నాని

కొత్త సినిమాలను సైన్ చేస్తోన్న నాని
కొత్త సినిమాలను సైన్ చేస్తోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఇప్పటివరకూ 25 సినిమాలు చేసాడు. 26వ చిత్రం టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉంది. రాహుల్ దర్శకత్వంలో చేస్తోన్న శ్యామ్ సింగ రాయ్ దాదాపు 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి చిత్రం చేయాల్సి ఉంది.

కొద్ది వారాల క్రితం లాక్ డౌన్ విధించడంతో నాని కొత్త సినిమాలను సైన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే కథలు కూడా ఏం వినలేదట. అయితే తెలంగాణలో కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే అన్ లాక్ విధానం కూడా మొదలైంది. దీంతో నాని మళ్ళీ కథలు వింటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం అంటే సుందరానికి పూర్తైన తర్వాత కొత్త దర్శకుడు శ్రీకాంత్ తో నాని పనిచేయనున్నాడు. అలాగే వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ చెప్పిన కథకు కూడా ఓకే చెప్పాడు నాని. ఈ ప్రాజెక్టుల గురించి మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది.