నాని – సుధీర్‌బాబు సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌!


నాని - సుధీర్‌బాబు సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌!
నాని – సుధీర్‌బాబు సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌!

క‌రోనా దెబ్బ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. దీని కార‌ణంగా కొన్ని సినిమాల షూటింగ్‌లు ఇప్ప‌టికే వాయిదా ప‌డ్డాయి. అయితే ప్ర‌భాస్ లాంటి వాళ్లు మాత్రం క‌రోనాకి భ‌య‌ప‌డ‌కుండా త‌మ సినిమా షూటింగ్‌ని కంటిన్యూ చేస్తూ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నారు. ఇదిలా వుంటే క‌రోనా కార‌ణంగా సినిమాల రిలీజ్‌లు కూడా వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి మొద‌లైంది. తాజాగా నాని, సుధీర్‌బాబు న‌టించిన సినిమా విడుద‌ల వాయిదా వేయాల్సి వ‌చ్చింది.

నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం ` వి`. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా కొత్త పంథాలో రూపొందిన ఈ చిత్రాన్ని ముందు అనుకున్న ప్ర‌కారం ఈ నెల 25న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా జ‌నాలు అధిక సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు.

జ‌నాలంతా క‌రోనా కార‌ణంగా భ‌యంతో వ‌ణికిపోతున్న వేళ ఓ బాధ్య‌గ‌ల వ్య‌క్తులుగా వారి ఆరోగ్యాన్ని ప‌రోక్షంగా కాపాడాల్సిన బాధ్య‌త మాపై ఎంతో వుంది. ఆ బ‌ల‌మైన కార‌ణం వ‌ల్ల‌నే త‌మ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర బృందం మీడియాకు ఓ ప్ర‌క‌ట‌నని విడుద‌ల చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తు ప‌రిస్థితిలో మార్పులు వ‌చ్చాక చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్ణయించుకున్నామ‌ని చిత్ర బృందం ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

Credit: Twitter