నాని వి సినిమా రిలీజ్ విషయంలో రూమర్స్ ను నమ్మకండి అంటున్నారే!


నాని వి సినిమా రిలీజ్ విషయంలో రూమర్స్ ను నమ్మకండి అంటున్నారే!
నాని వి సినిమా రిలీజ్ విషయంలో రూమర్స్ ను నమ్మకండి అంటున్నారే!

న్యాచురల్ స్టార్ నాని తన ల్యాండ్ మార్క్ సినిమా వి లో నెగటివ్ పాత్రను పోషించిన విషయం తెల్సిందే. సుధీర్ బాబు, అదితి రావు, నివేతా థామస్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. మార్చ్ 25న ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల అది కుదర్లేదు. గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా విషయంలో రూమర్స్ షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే.

వి సినిమా ఓటిటిలో విడుదల కాబోతోందని, అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే డీల్ సెట్ చేసుకుందని, 33 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేసిందని అన్నారు. సెప్టెంబర్ 5న వి అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుందని చెప్పేసారు కూడా. అయితే ఇప్పుడు అనుకోకుండా మరో వార్త షికారు చేస్తోంది. వి సినిమా రిలీజ్ విషయంలో వచ్చినవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని, రిలీజ్ విషయంలో దిల్ రాజు ఇంకా కచితంగానే ఉన్నారని, థియేటర్లోనే వి రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

ఏదేమైనా వి సినిమా గురించి అధికారికంగా అప్డేట్ వచ్చే దాకా ఈ రూమర్స్ ఆగే అవకాశమే లేదు.