నాని, సుధీర్‌బాబు చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ !


Nani, sudheer babus v film will release at cristmas
Nani, sudheer babus v film will release at cristmas

మార్చిలో రిలీజ్ కావాల్సిన చిత్రాల‌న్నీ దాదాపుగా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. ఇప్ప‌టికీ వాటి రిలీజ్‌పై క్లారిటీ లేదు. కార‌ణం థియేట‌ర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియ‌దు. దీంతో చాలా వ‌ర‌కు క్రేజీ చిత్రాల రిలీజ్‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. అందులో తొలిసారి నాని ప్ర‌తినాయ‌కుడిగా, సుధీర్‌బాబు హీరోగా న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి` రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

ముందు మార్చి 25న రిలీజ్ చేయాల‌ని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. అయితే అప్ప‌టికే లాక్‌డౌన్ ప్రారంభం కావ‌డం.. వైర‌స్ ప్ర‌బ‌లుతుండ‌టంతో థియేట‌ర్ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. దీంతో `వి` రిలీజ్ వాయిదా ప‌డింది. ఆ త‌రువాత ఏప్రిల్ లేదా మేలో `వి` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై చిత్ర బృందం స్పందించి ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

తాజాగా ఆగ‌స్టు 1 నుంచి థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని కేంద్రం చెబుతున్న‌ట్టు వార్త‌లు షికారు చేస్తున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ `వి` చిత్రం వార్త‌ల్లో నిలిచింది. తాజాఆ ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్‌కి రిలీజ్ చేయాల‌ని నిర్మాత ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. అప్ప‌టి వ‌ర‌కు వాఆవ‌ర‌ణంలో మార్పులు ఏర్ప‌డ‌తాయ‌ని, వ్యాక్సిన్ కూడా వ‌చ్చే అవ‌కాశం వుండ‌టంతో థియేట‌ర్లు తెరుచుకోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.