టక్ జగదీష్ లో నాని ప్రాబ్లెమ్ ఏంటి?


 

nani suffers from bipolar disorder in tuck jagadish
nani suffers from bipolar disorder in tuck jagadish

భలే భలే మగాడివోయ్ చిత్రంతో మతిమరుపు ఉన్న పాత్రలో జీవించాడు నాని. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తన న్యాచురల్ యాక్టింగ్ తో ఇరగదీశాడనే చెప్పవచ్చు. ఇక తాజా సమాచారం ప్రకారం నాని మరోసారి మానసిక ప్రాబ్లెమ్ ఉన్న వ్యక్తి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నాని తన 25వ సినిమా V లో నెగటివ్ ఛాయలున్న పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. దాని తర్వాత టక్ జగదీష్ అనే సినిమాను చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ సినిమాకు కరోనా వైరస్ బ్రేకులు వేసింది.

రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నానికి ఒక మానసిక సమస్య ఉంటుందట. బై పోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తిగా నాని కనిపిస్తాడని, అదే తన పాత్రకు కొత్తదనాన్ని తీసుకొస్తుందని వినికిడి. బిపోలార్ డిజార్డర్ అంటే మానసిక అసతుల్యతలు ఉంటాయి. అంటే బాధ వస్తే అతిగా బాధపడడం, కోపం వస్తే అతిగా రావడం, సంతోషం కూడా అంతే. ఇలా ఎమోషన్స్ అన్నీ అతిగానే ఉంటాయి. ఈ తరహా పాత్రలో నాని ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.