విజయ్ దర్శకుడితో నాని సినిమా ఫిక్స్!


విజయ్ దర్శకుడితో నాని సినిమా ఫిక్స్!
విజయ్ దర్శకుడితో నాని సినిమా ఫిక్స్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు, న్యాచురల్ స్టార్ నాని మధ్య తెలియని కోల్డ్ వార్ ఏదో నడుస్తోందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. నిజానికి విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన సినిమా అంటే ఎవడె సుబ్రహ్మణ్యం. నాని హీరోగా వచ్చిన ఈ సినిమాతో విజయ్ కు అంతో ఇంతో గుర్తింపు అనేది లభించింది. అయితే చేసినవి తక్కువ సినిమాలే అయినా భారీ హిట్లు ఇవ్వడంతో చాలా తక్కువ కాలంలోనే విజయ్ దేవరకొండతో తనదైన మార్కెట్ ఏర్పడింది. ఇన్నేళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న మార్కెట్, విజయ్ కు చాలా తక్కువ టైమ్ లో వచ్చేయడం నానికి అంతగా ఎక్కలేదని ఒక రూమర్ ఉంది. మరోవైపు విజయ్ కు కూడా ప్రతిసారీ నాని సినిమా వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్న వార్త కూడా ఇబ్బందిగానే అనిపించింది. సో, అలా తెలియకుండానే ఇద్దరి మధ్య ఒకలాంటి కోల్డ్ వార్ మొదలైనట్లుగా తెలుస్తోంది.

ఇది పక్కనపెడితే ఇద్దరూ కూడా దర్శకుల విషయంలో కూడా పోటీ పడుతున్నట్లు రూమర్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ టచ్ లోకి వస్తున్నాడని తెలియగానే నాని తన దగ్గరకు శివను పిలిపించుకుని వెంటనే టక్ జగదీశ్ సినిమాను ఓకే చేసేశాడని ఒక వార్త ఉంది. ఇది నిజమో కాదో తెలీదు కానీ ఇప్పుడు నాని మరోసారి విజయ్ దర్శకుడితోనే పనిచేయాలని డిసైడ్ అయ్యాడు.

టాక్సీ వాలా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు రాహుల్ సంక్రిత్యాన్‌. టాక్సీవాలా మంచి విజయం సాధించినా రాహుల్ కు నెక్స్ట్ సినిమా సెట్ అవ్వడానికి టైమ్ పట్టింది. అయితే ఇప్పుడు రాహుల్ చెప్పిన కథను నాని ఓకే చెప్పినట్లుగా అధికారిక సమాచారం ఉంది. వివరాల్లోకి వెళితే నాని – రాహుల్ – సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఒక సినిమాకు పనిచేయబోతున్నాయి. జెర్సీ అప్పుడే నానితో రెండు సినిమాల డీల్ సైన్ చేయించుకుంది సితార. జెర్సీ ఒకటి అయిపోగా ఇప్పుడు రాహుల్ సినిమాతో డీల్ క్లోజ్ అయిపోతుందన్న మాట. నాని ప్రస్తుతం చేస్తోన్న V, తర్వాత చేయబోయే టక్ జగదీశ్ దాని తర్వాత నాని రాహుల్ తో సినిమా చేస్తాడన్నమాట.