గ్యాంగ్ లీడర్ రిలీజ్ : థాయ్ ల్యాండ్ చెక్కేయనున్న నాని


Nani
గ్యాంగ్ లీడర్ రిలీజ్ : థాయ్ ల్యాండ్ చెక్కేయనున్న నాని

మంచి అంచనాల మధ్య న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి బాగుందనే రివ్యూలు వస్తుండడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఓ మోస్తరు ఓపెనింగ్స్ తో మొదలైన గ్యాంగ్ లీడర్ ఈ వారాంతం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందన్నదాని మీదే చిత్ర విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని థాయ్ ల్యాండ్ చెక్కేస్తున్నట్లు తెలుస్తోంది. తన తర్వాతి చిత్రం ‘వి’ చిత్రీకరణలో పాల్గొనడానికి త్వరలోనే నాని బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న సీరియల్ కిల్లర్ పాత్ర చేస్తోన్న విషయం తెల్సిందే. మరోవైపు హీరో సుధీర్ బాబు అండ్ టీమ్ ఇప్పటికే థాయ్ ల్యాండ్ చేరుకున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో సుధీర్ బాబు, నాని మరికొంత మంది కీలక నటుల మధ్య సీన్లు చిత్రీకరించనున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో “వి” చిత్రం తెరకెక్కుతోంది.