10 నెలల్లో మూడు సినిమాలు.. నాని దూకుడు మాములుగా లేదుగా


10 నెలల్లో మూడు సినిమాలు.. నాని దూకుడు మాములుగా లేదుగా
10 నెలల్లో మూడు సినిమాలు.. నాని దూకుడు మాములుగా లేదుగా

న్యాచురల్ స్టార్ నాని.. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు ఫాస్ట్ గా చేసే నటులలో నాని ముందు వరసలో ఉంటాడు. వరసగా దేవదాస్, కృష్ణార్జున యుద్ధం సినిమాలు ప్లాప్ అవ్వడంతో నాని కొంచెం స్లో అయినట్లు అనిపించాడు కానీ గతేడాది మళ్ళీ రెండు సినిమాలతో తానేంటో నిరూపించాడు. జెర్సీ సినిమాలో నాని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక గ్యాంగ్ లీడర్ లో కూడా నాని మెప్పించాడు. అయితే ఈ రెండు సినిమాలూ కూడా స్థాయికి తగ్గ విజయాల్ని సాధించడంలో విఫలమయ్యాయి. మోస్తరుగా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఆడాయి. అయితే 2020లో మాత్రం నాని మరింత దూకుడు చూపిస్తున్నాడు. అయితే గత రెండేళ్లు ఏడాదికి రెండే సినిమాలు చేస్తూ వచ్చిన నాని ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచాడు. ఈ ఏడాది నాని నటించిన మూడు సినిమాలు విడుదలవుతాయి.

ముందుగా మార్చ్ 25న ఉగాది సందర్భంగా నాని నెగటివ్ పాత్రలో నటించిన v చిత్రం విడుదలవుతుంది. ఇప్పటికే టీజర్ తో ఈ చిత్రం భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదల కాకుండానే నాని మరో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టేశాడు. తనతో నిన్ను కోరి సినిమాను తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. జులై లేదా ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

దీంతో పాటు నాని ఇటీవలే మరో సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ సంకిత్య్రన్ దర్శకుడిగా ప్రకటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ ను వేసవి తర్వాత మొదలుపెట్టనున్నాడు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే సరిగ్గా 10 నెలల గ్యాప్ లో మూడు సినిమాలతో నాని ఈ ఏడాది హల్చల్ చేయనున్నాడు. మరి గతేడాదిలా పేరు మాత్రమే వస్తుందా లేక మళ్ళీ కమర్షియల్ సక్సెస్ లతో అందరినీ అలరిస్తాడా అన్నది వేచి చూడాలి.