చిరు మూవీ మాట ‌.. నేచురల్ స్టార్ నోట‌!


చిరు మూవీ మాట ‌.. నేచురల్ స్టార్ నోట‌!
చిరు మూవీ మాట ‌.. నేచురల్ స్టార్ నోట‌!

`జ‌గ‌దేక వీరుడు అతిలోక‌సుంద‌రి`.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అతిలోక సుంద‌న‌రి శ్రీదేవి హీరోయిన్ గా న‌టించిన చిత్ర‌మిది. 1990లో మే9 విడుద‌లైన ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఈ చిత్ర రిలీజ్ స‌మ‌యంలో తుఫాన్ భీభ‌త్సం సృష్టించింది. అయినా స‌రే ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది‌.

ఈ చిత్రం విడుద‌లై ఈ నెల 9కి 30 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర బృందం హీరె నేచుర‌ల్ స్టార్ నాని చేత ఈ చిత్రానికి సంబంధించిన మూడు హిడెన్ స్టోరీస్  రివీల్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా స‌మ‌యంలో మూడు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు జ‌రిగాయ‌ట‌. అవేంటి? అన్న‌ది హీరో నాని వెల్ల‌డిస్తార‌ట‌.

ఈ నెల 5, 7,9 తేదీల్లో మూడు హిడెన్ స్టోరీస్‌ని హీరో నేచురల్ స్టార్ నాని వెల్ల‌డించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని వైజయంతీ మూవీస్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ఈ మంగ‌ళ వారం నుంచి `జ‌గ‌దీఏక వీరుడు అతిలోక సుంద‌రి` హిడెన్ స్టోరీస్ హంగామా ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే నాని న‌టించిన `వి` రిలీజ్‌కి రెడీగా వుంది. మ‌రో చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. శ్యామ్ సింగ‌రాయ్‌` రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కావ‌త‌ల్సి వుంది.