నానితో పనిచేయనున్న కాజల్?

నానితో పనిచేయనున్న కాజల్?
నానితో పనిచేయనున్న కాజల్?

న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణంలో వరసగా రెండు చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. హిట్ 2 ను కొన్ని నెలల ముందే లాంచ్ చేయగా రీసెంట్ మీట్ క్యూట్ చిత్రాన్ని కూడా లాంచ్ చేసాడు. ఈ సినిమాను నాని సోదరి దీప్తి ఘంటా డైరెక్ట్ చేస్తుండడం విశేషం. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ ఉంటారు.

ఇప్పటికే నివేతా థామస్, రుహాని శర్మ, అదా శర్మలు హీరోయిన్లుగా కన్ఫర్మ్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ ను కూడా హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. నాని నిర్మాణంలో తెరకెక్కిన అ! చిత్రంలో కాజల్ ప్రధాన పాత్రలో  నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు కూడా కాజల్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడు నాని.

సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు వచ్చే అవకాశముంది.