`ట‌క్ జ‌గ‌దీష్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

`ట‌క్ జ‌గ‌దీష్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!
`ట‌క్ జ‌గ‌దీష్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

నేచుర‌ల్ స్టార్ నాని సినిమాల ప‌రంగా స్పీడు పెంచారు. వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ షాకిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. శివ నిర్వాణ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `నిన్ను కోరి` వంటి రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కిన విష‌యం తెలిసింది. మ‌రో సారి ఈ ఇద్ద‌రు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని జోడించి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌లు. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మాంచి ఊపులో వున్న త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హీరో నాని పుట్టిన రోజు ఈ నెల 24. ఈ సందర్భంగా ఒక్క‌రోజు ముందుగానే ఈ చిత్ర టీజ‌ర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పండగకి వచ్చే సినిమాలు కొన్ని… పండగలాంటి సినిమాలు కొన్ని.. అంటూ నాని ట్వీట్ చేశారు.

ఓ గ్రామాన్ని చూపిస్తూ కోడి పందాల నేప‌థ్యంలో `ఏటికొక్క పూటా.. యానాది పాటా.. నాయుడోరి నోట నుంచి వ‌చ్చిందే మాట‌…` అనే నేప‌థ్యగీతంతో ఒక్క డైలాగ్ కూడా లేకుండా టీజ‌ర్ మొద‌లైంది. ఇందులో కోడి పందాలు.. ప్ర‌త‌ర్య‌ర్థుల‌కి ట‌క్ జ‌గ‌దీష్ బుద్ది చెబుతున్న తీరు, అత‌నిపై కుటుంబ స‌భ్యులు చూపించే ప్రేమ‌.. వారి కోసం ఎంత వ‌ర‌కైనా తెగించ‌డానికి సిద్ధ‌ప‌డే ట‌క్ జ‌గ‌దీష్ ధైర్యం.. వంటి స‌న్నివేశాల‌తో టీజ‌ర్‌ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా చూపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 23న స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.