`ట‌క్ జ‌గ‌దీష్‌` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

`ట‌క్ జ‌గ‌దీష్‌` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!
`ట‌క్ జ‌గ‌దీష్‌` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ట‌క్ జ‌గ‌దీష్‌`. శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్నారు. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యారాజేష్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `నిన్నుకోరి` వంటి బ్లాక్ బస్ట‌ర్ హిట్ త‌రువాత నాని, శివ నిర్వాణ‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ఓ విభిన్న‌మైన క‌థాంశంతో ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ వుంటుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌తో పాటు కొత్త పోస్ట‌ర్‌ని హీరో నాని రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీని ఉగాది కానుక‌గా ఏప్రిల్ 16న రిలీజ్ చేస్తున్న‌ట్టు హీరో నాని ప్ర‌క‌టించారు. ‌

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష‌మైన స్పంద‌న ల‌బించింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంటోంది. ఈ పోస్ట‌ర్‌లో కుటుంబ స‌భ్యులంతా క‌లిసి హీరో నానిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేస్తున్నారు. పొంగ‌ల్ రేస్‌కి రెడీ అయిన ఈ మూవీతో మ‌ళ్లీ నాని స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేస్తార‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.