వెనకడుగు వేసిన నాని


Gang Leader
Gang Leader

నాని ప్రభాస్ కోసం వెనకడుగు వేసాడు , ప్రభాస్ సాహో కి పోటీగా తన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని విడుదల చేయకుండా సెప్టెంబర్ 13 కు మార్చాడు . తాజాగా నాని ఈ విషయాన్నీ ధృవీకరిస్తూ ట్వీట్ చేసాడు . సెప్టెంబర్ 13 న గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు . గ్యాంగ్ లీడర్ అసలు ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది . ఇక ఇప్పుడేమో ప్రభాస్ కోసం మళ్ళీ మార్చారు .

సాహో ఆగస్టు 30 న విడుదల అవుతుండటంతో అదే రోజున గ్యాంగ్ లీడర్ విడుదల చేయడం వల్ల నాని కే సమస్యలు వస్తాయి కాబట్టి తెలివిగా తప్పుకున్నాడు . సాహో సోలోగా రావాలి బ్లాక్ బస్టర్ అవ్వాలి అని ఆశిస్తున్నాడు నాని . ఇక నాని గ్యాంగ్ లీడర్ చిత్ర విషయానికి వస్తే …… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందట ! ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13 న విడుదల కానుంది .