బిగ్ బాస్ చేసినందుకు కుమిలిపోతున్న నాని


Nani unhappy with bigg boss 2

బిగ్ బాస్ 2 కు హోస్ట్ గా వ్యవహరించినందుకు కుమిలి ,కుమిలిపోతున్నాడట నాని . మొదట్లోనేమో ఎన్టీఆర్ స్థాయిలో నాని హోస్ట్ గా చేయడం లేదని , ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే రాను రాను ఆ విమర్శలు పోయి ఇతర అంశాలు తెరమీదకు వచ్చాయి. కట్ చేస్తే అన్ని అంశాలు పక్కకు పోయి కౌశల్ ఆర్మీ దాడి నానిపై ఎక్కువగా పనిచేసింది. ఎక్కువ ఒత్తిడి అయ్యింది నాని మీద . ఒక దశలో కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ నే శాసించే స్థాయికి రావడంతో నాని ఓ లెక్కా . కౌశల్ ని విమర్శించే వాళ్ళని కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసింది. అందులో నాని కూడా ఉండటంతో పాపం నాని పరిస్థితి దారుణంగా మారింది.

కౌశల్ ని టార్గెట్ చేయడానికి మిగతా వాళ్ల లాగే నాని కూడా వ్యవహరించాడని అందుకే నాని ని టార్గెట్ చేస్తున్నామని బహిరంగంగానే ప్రకటించారు కౌశల్ ఆర్మీ. దాంతో బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా చేసినందుకు నిజంగానే కుమిలిపోతున్నాడట నాని. బిగ్ బాస్ వల్ల నాని కి మంచి పేరు రాకపోగా విమర్శలు రావడమే కాకుండా కొంతమంది శత్రువులను సంపాదించుకున్నట్లు అయ్యిందని బాధపడుతున్నాడట నాని. కౌశల్ ఆర్మీ పగబట్టినట్లుగానే నాని నటించిన దేవదాస్ ప్లాప్ అయ్యింది.

English Title: Nani unhappy with bigg boss 2