నాని ఆ సినిమా నుండి తప్పుకున్నాడట


nani unhappy with kishor tirumala script

వరుస విజయాలు సాధిస్తున్న నాని ఇటీవలే నిర్మాతగా మారి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ,కాగా భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు నాని పైగా ఆ సినిమాకు దర్శకుడు నేను శైలజ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన కిషోర్ తిరుమల దర్శకుడు కావడంతో వెంటనే ఒప్పుకున్నాడు . కిషోర్ చెప్పిన లైన్ నాని కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట !

కట్ చేస్తే ఆ సినిమా కథ సంతృప్తి కరంగా రాలేదని రకరకాల మార్పులు చెప్పాడట నాని కానీ నాని కోరుకున్న రేంజ్ లో స్క్రిప్ట్ లో మార్పులు చేయలేక పోయాడట దర్శకుడు కిషోర్ తిరుమల దాంతో అసంతృప్తి తో సినిమా చేసేకంటే తప్పుకోవడం బెటర్ అని భావించిన నాని మైత్రి మూవీస్ నిర్మాతలకు కిషోర్ తో సినిమా చేయలేనని తప్పుకున్నాడట ! దాంతో అదే కథ ని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి చెప్పించి అతడితో సినిమా ప్లాన్ చేస్తున్నారు . మరి ఏమౌతుందో !