నెమ్మదిగా గమ్యం వైపు గ్యాంగ్ లీడర్Gang Leader Collections
నెమ్మదిగా గమ్యం వైపు గ్యాంగ్ లీడర్

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం మిశ్రమ స్పందన వచ్చినా కానీ నిలబడింది. వారాంతానికి దాదాపు సగం పెట్టుబడి వెనక్కి రాబట్టిన గ్యాంగ్ లీడర్ సోమవారం నుండి అసలైన టెస్ట్ ను ఎదుర్కుంటోంది. సాధారణంగా తక్కువ వసూళ్లు నమోదయ్యే సోమవారం గ్యాంగ్ లీడర్ నిలబడింది. డ్రాప్స్ మరీ ఎక్కువ నమోదు కాకపోవడం సినిమా ఫలితంపై సానుకూల ప్రభావం చూపనుంది.

ముఖ్యంగా నైజాంలో సోమవారం గ్యాంగ్ లీడర్ 52 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో నాలుగు రోజుల్లో గ్యాంగ్ లీడర్ నైజాం ప్రాంతంలో 5 కోట్ల 21 లక్షల షేర్ రాబట్టింది. ఈ సినిమాను ఇక్కడ 8 కోట్లకు పంపిణీ చేసారు. ఇదే మొమెంటం రెండో వారాంతానికి కూడా కొనసాగితే సినిమా లాభాల్లోకి వెళ్లడం ఖాయం. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.