గ్యాంగ్ లీడర్ ఆరు రోజుల కలెక్షన్ల వివరాలు


Gang Leader Collections
గ్యాంగ్ లీడర్ ఆరు రోజుల కలెక్షన్ల వివరాలు

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ప్లాప్ ముద్ర దిశగా సాగుతోంది. మొదటి మూడు రోజులు ఈ చిత్రానికి డీసెంట్ కలెక్షన్స్ రాగా, సోమవారం నుండి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. రేపు వాల్మీకి విడుదల కానుండడం, ఇంకా 40 శాతానికి పైగా రికవర్ కావాల్సి ఉండడంతో గ్యాంగ్ లీడర్ సేఫ్ అయ్యే అవకాశాలు తక్కువే. ఒకవేళ వాల్మీకి టాక్ తేడా కొడితే గ్యాంగ్ లీడర్ కి ఏదైనా అవకాశముంటుంది లేదంటే నాని ఖాతాలో మరో ప్లాప్ చేరినట్లే.

ఇక ఆరు రోజులకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపు 14 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఆరో రోజు కేవలం 37 లక్షలు వచ్చాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒకసారి ఆరు రోజులకు కలెక్షన్స్ బ్రేకప్ లిస్ట్ చూస్తే..

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 5.72

సీడెడ్ 1.75

నెల్లూరు 0.44

కృష్ణ 1.06

గుంటూరు 1.12

వైజాగ్ 1.89

తూర్పు గోదావరి 1.21

పశ్చిమ గోదావరి 0.78

షేర్ మొత్తం 13.97