నానీస్ గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే కలెక్షన్స్


Nanis Gang Leader First Day Collections
Nani’s Gang Leader First Day Collections

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్ర వసూళ్లు ఆ చిత్రానికి వచ్చిన రివ్యూలలానే అటు సూపర్ ఇటు ప్లాప్ కు మధ్యస్థంగా వస్తున్నాయి. మొదటి రోజు ఈ చిత్ర వసూళ్లు గమనిస్తే జెర్సీ కంటే తక్కువ వసూలైనా మరీ తీసికట్టుగా ఏం లేవు. అయితే దాదాపు 30 కోట్లు రికవర్ చేయాల్సిన నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మొదటి రోజు గ్యాంగ్ లీడర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.51 కోట్లు వసూలు చేసింది. కింద ఏరియా వైజ్ బ్రేకప్ ఇస్తున్నాం.

ఏరియా                షేర్ (కోట్లలో)
నైజాం                  1.67
సీడెడ్                   0.51
నెల్లూరు                0.15
కృష్ణ                     0.33
గుంటూరు              0.46
తూర్పు గోదావరి    0.61
పశ్చిమ గోదావరి    0.52

మొత్తంగా: 4.51cr