డిస్ట్రిబ్యూటర్లను ఆందోళనకు గురి చేస్తున్న గ్యాంగ్ లీడర్


Gang Leader First Day Collections
Gang Leader First Day Collections

న్యాచురల్ స్టార్ నాని ని టాలీవుడ్ లో మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ గా పరిగణిస్తారు. ఒకానొక సమయంలో వరసగా ఆరేడు సినిమాలు హిట్లు కొట్టాడు నాని. అయితే ఆ మధ్య వరసగా రెండు ప్లాపులు వచ్చినా జెర్సీ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. నిజానికి జెర్సీ సినిమాకు సూపర్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ చివరికి జెర్సీ ఓ మోస్తరు హిట్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు విడుదలైన గ్యాంగ్ లీడర్ విషయంలో కూడా ఇలాంటి ట్రెండ్ నడుస్తోంది.

ఇక్కడ ఆందోళన చెందాల్సిన అంశమేమిటంటే జెర్సీ టైపులో గ్యాంగ్ లీడర్ కు సూపర్ పాజిటివ్ రివ్యూలు రాలేదు. మిశ్రమ స్పందన లభించింది. ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ అది బుకింగ్స్ కు దారి తీయలేదు. మొదటి రోజు గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు జెర్సీ కంటే తక్కువ స్థాయిలో నమోదవ్వడం డిస్ట్రిబ్యూటర్లను ఆందోళనకు గురి చేస్తోంది. నైజాంలో మొదటి రోజు గ్యాంగ్ లీడర్ 1.67 కోట్లు వసూలు చేసింది. జెర్సీ అయితే 1.93 కోట్లు వసూలు చేసింది.

ఇక యూఎస్ లో గ్యాంగ్ లీడర్ ప్రీమియర్ ప్లస్ మొదటిరోజు కలిపి 350K డాలర్లు వసూలు చేస్తే, జెర్సీ సమయంలో అది 410K డాలర్లు వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాల్లో జెర్సీ కంటే తక్కువ వసూలు చేస్తుండడంతో గ్యాంగ్ లీడర్ పై పెట్టుబడి పెట్టినవారు ఇప్పుడు ఏమవుతుందా అని ఆందోళన చెందుతున్నారు.