గ్యాంగ్ లీడర్ సగం పని అయిపోయింది


Gang Leader Collections
గ్యాంగ్ లీడర్ సగం పని అయిపోయింది

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి మొదట మిశ్రమ స్పందన వచ్చింది. ప్రతిసారి స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే విక్రమ్ కుమార్, ఈసారి విఫలమయ్యాడని రివ్యూయర్లు యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. నాని తన నటనతో మెప్పించినా సెకండ్ హాఫ్ సాదాసీదాగా ఉందని, ప్రతీ సీన్ ముందే ఊహించే విధంగా ఉందని వారు విమర్శించారు.

దీంతో నాని ఖాతాలో మరో ప్లాప్ చేరుతుందా అనిపించింది. అయితే అటువంటిదేం జరగదని నాని మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా, మొదటి రోజు మరీ ఎక్కువ వసూళ్లు రాకపోయినా నాని సినిమా శనివారం, ఆదివారం భారీగా పుంజుకోవడంతో తొలి వీకెండ్ ముగిసేసరికే గ్యాంగ్ లీడర్ సగానికి పైగా పెట్టుబడి తిరిగి రాబట్టగలిగింది.

మొదటి రోజు కన్నా రెండో రోజు, రెండో రోజు కన్నా మూడో రోజు కలెక్షన్స్ ఎక్కువగా రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో రెండో వారం ముగిసేసరికి గ్యాంగ్ లీడర్ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తమ్మీద గ్యాంగ్ లీడర్ నాని ఖాతాలో మరో హిట్ జమచేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రియాంక నాని సరసన నటించగా అనిరుధ్ సంగీతం అందించారు.