ఓవర్సీస్ లో కష్టపడుతున్న గ్యాంగ్ లీడర్


Nanis Gang Leader struggling to reach 1 million mark
Nanis Gang Leader struggling to reach 1 million mark

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం మొదటి వారాంతం వరకూ డీసెంట్ గా కలెక్ట్ చేసి బయ్యర్లలో ఆశలు రేకెత్తించింది. అయితే సోమవారం నుండి చిత్ర కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తుండడంతో పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేలా కనిపించట్లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం మొదట భారీ హిట్ అయ్యేలా కనిపించింది. నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. దానికి తగ్గట్లే ప్రీమియర్ల ద్వారా 200,132 డాలర్లు వసూలు కాగా, శుక్రవారం 149,031 డాలర్లు కలెక్ట్ చేసింది.

ఇక శని, ఆదివారాల్లో వరసగా 257,270 డాలర్లు, 130,860 డాలర్లు వసూలు చేయడంతో ఇక ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ ను చేరుకోవడం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే అనూహ్యంగా సోమవారం నుండి కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. బుధవారం వరకూ చూసుకుంటే గ్యాంగ్ లీడర్ $834K మాత్రమే వసూలు చేసింది. రేపు వాల్మీకి విడుదలవుతుండడంతో గ్యాంగ్ లీడర్ 1 మిలియన్ మార్క్ ను చేరుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.