గ్యాంగ్ లీడర్ ట్రైలర్ : రివెంజ్ తీర్చుకోవడానికి రివెంజ్ డైరెక్టర్ సహాయం


Nani's Gang Leader Trailer
Nani’s Gang Leader Trailer

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ఇటీవలే జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా సాధించిన నాని ఇప్పుడు గ్యాంగ్ లీడర్ గా మన ముందుకు రాబోతున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. సెప్టెంబర్ 13న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.

రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారథి పాత్రలో నటిస్తున్న నాని పేరుకి తగ్గట్లే రివెంజ్ కథలు రాస్తుంటాడు. అయితే కామెడీగా సాగిపోతున్న అతని జీవితంలోకి ఐదుగురు మహిళలు ఎంటరవుతారు. ఒక 8 ఏళ్ళ పాప.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల యువతి.. 50 ఏళ్ల మహిళ.. 80 ఏళ్ల బామ్మ.. వీరు పగ తీర్చుకోవడానికి పెన్సిల్ ను వాడుకుంటారు. అసలు పెన్సిల్ వీళ్ళకి ఎందుకు సహాయం చేసాడు. తర్వాత ఏం జరిగింది. ఇంతకీ ఆ ఐదుగురు ఆడవాళ్లకు జరిగిన అన్యాయమేంటి అన్నవి సినిమా చూసే తెలుసుకోవాలి. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.