జెర్సీ చిత్రాన్ని లీక్ చేసిన తమిళ రాకర్స్


నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రానికి షాక్ తగిలింది . తమిళ రాకర్స్ జెర్సీ చిత్రాన్ని లీక్ చేసింది . పైరసీ పై చిత్ర పరిశ్రమ ఎంతగా పోరాడుతున్నప్పటికీ తమిళ రాకర్స్ మాత్రం ఏ సినిమాని వదిలి పెట్టకుండా లీక్ చేస్తూనే ఉన్నారు పైరసీ చేస్తూ శునకానందం పొందుతూనే ఉన్నారు . జెర్సీ చిత్రానికి హిట్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే . ఇలాంటి చిత్రానికి వసూళ్ల పరంగా పైరసీ దెబ్బ తగులుతుంది .

ఏప్రిల్ 19 న విడుదలైన జెర్సీ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది అయితే కొంతమంది కుటుంబం మొత్తం కలిసి థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం కుదరదు డబ్బుల రీత్యా అలా కొంతమంది ఇలా పైరసీ ని ఆశ్రయిస్తున్నారు . దాంతో అది వసూళ్ల పరంగా ఇబ్బంది కలిగిస్తోంది ఆ యా చిత్రాలకు . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి పేరు వచ్చింది కానీ తమిళ రాకర్స్ రూపంలో గట్టి దెబ్బే తగలనుంది .