బాలీవుడ్ లో రీమేక్ కానున్న నాని జెర్సీ


jersy
jersy

నాని నటించిన జెర్సీ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కానుంది . నానిశ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలు మాత్రమే లభించాయి కానీ వసూళ్ల పరంగా వెనుకబడింది . అయితే హార్ట్ టచింగ్ స్టోరీ అందునా క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో జెర్సీ ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ ముందుకు వచ్చాడట

ఇక ఇటీవలే కబీర్ సింగ్ తో సంచలన విజయం సాధిస్తున్న షాహిద్ కపూర్ జెర్సీ రీమేక్ లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి . అలాగే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడట . నాని కి నటుడిగా మంచి మార్కులు తెచ్చిపెట్టిన జెర్సీ హిందీలో కమర్షియల్ గా కూడా విజయవంతం అవుతుందేమో చూడాలి