నాని జెర్సీ ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందంటే


నానిశ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన ” జెర్సీ ” చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగదేవర వంశీ నిర్మించాడు . ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఈరోజు విడుదల అయినప్పటికీ ఓవర్ సీస్ లో మాత్రం కొద్ది గంటలు ముందుగానే విడుదల అయ్యింది షోలు కూడా పడ్డాయి . ఇక ఆ షోల ప్రకారం ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందో తెలుసా ……. సూపర్ హిట్ అని .

నాని సహజ నటనతో ప్రేక్షకులను కట్టి పడేసాడని కొనియాడుతున్నారు ఓవర్ సీస్ జనాలు . శ్రద్దా శ్రీనాథ్ అలాగే మిగతా క్యారెక్టర్ లు పోషించిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేయడంతో జెర్సీ చిత్రం అంచనాలను అందుకోవడం ఖాయమని , నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు . అనిరుద్ నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని , నాని తో పాటుగా దర్శకుడు గౌతమ్ ని కూడా ప్రశంసిస్తున్నారు ఓవర్ సీస్ జనాలు .