జెర్సీ ప్రీమియర్ షో బుల్లితెరపై ఈరోజే !


Jersey
Jersey

నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం ఈరోజు బుల్లితెర పై ప్రీమియర్ షో పడనుంది . వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో గా ఈరోజు సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం నాని కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయింది . నాని క్రికెట్ ప్లేయర్ గా నటించిన ఈ చిత్రానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది . అయితే సినిమాకు ఆశించిన స్థాయిలో అయితే వసూళ్లు రాలేదు .

జీ తెలుగులో సాయంత్రం 5 గంటలకు షో పడుతుండటంతో బుల్లితెర ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి .ఏ ఎందుకంటే కొంతమంది ఈ సినిమాని థియేటర్ లో చూడలేదు అలాంటి వాళ్లకు జెర్సీ మంచి కనువిందు కానుంది . నాని అద్భుత నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం . అయితే ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున సినిమాలు వేస్తున్నారు టివి లలో . మరి ఈ సినిమా ఎక్కువ రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి .