జెర్సీ ఓవర్ సీస్ హక్కులు 4 కోట్లా ?


నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం ఈనెల 19 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . ఇక ఈరోజు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా జెర్సీ ప్రీ రిలీజ్ వేడుక భారీ ఎత్తున చేయడానికి ఏర్పాట్లు చేసారు . నాని సరసన కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్ నటించింది . మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ఓవర్ సీస్ హక్కుల కోసం 4 కోట్లు చెల్లించడానికి ముందుకు రావడం సంచలనం సృష్టించింది .

ఎందుకంటే నాని హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఇంతకుముందు ప్లాప్ అయ్యాయి , దాంతో ఓవర్ సీస్ లో అంతగా వసూళ్లు రాబట్టలేక పోయాడు నాని . అయినప్పటికీ జెర్సీ విషయంలో మాత్రం అలాంటి ఆలోచన లేకుండా 4 కోట్లకు కొన్నారు . జెర్సీ చిత్రం టీజర్ , ట్రైలర్ లు సినిమాపై అంచనాలు పెంచేలా ఉండటంతో జెర్సీ ని ఎక్కువ రేటుకి కొన్నారు . ఇక ఈనెల 19 న రిలీజ్ అయిన తర్వాత కానీ తెలీదు జెర్సీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోందో ? అన్నది .