ఏప్రిల్ 12న జెర్సీ ట్రైలర్ 19న సినిమా రిలీజ్


నాని హీరోగా నటించిన జెర్సీ చిత్ర ట్రైలర్ ని ఈనెల 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి . ఏప్రిల్ 12న ట్రైలర్ ని ఏప్రిల్ 15న ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించి ఏప్రిల్ 19న సినిమాని భారీ ఎత్తున విడుదల చేస్తున్నామని తెలిపారు.

నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ నటించింది. నాని ఈ చిత్రంలో క్రికెటర్ గా నటించాడు. క్రికెట్ కోసం నాని ఎంతో కష్టపడ్డాడు. షూటింగ్ లో నాని గాయపడ్డాడు కూడా. షూటింగ్ లో గాయాల పాలైనప్పటికి ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్ పూర్తి చేశాడు నాని.

జెర్సీ నా నటజీవితంలోనే ఓ మైలురాయి గా నిలిచిపోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు నాని. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది.