బిజినెస్ లో అదరగొట్టిన జెర్సీ


వరల్డ్ వైడ్ గా జరిగిన బిజినెస్ లో జెర్సీ అదరగొట్టింది . 26కోట్ల 60 లక్షల బిజినెస్ కేవలం థియేట్రికల్ రూపంలో చేసింది . వీటికి అదనంగా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలో బిజినెస్ చేసింది . నాని నటించిన కృష్ణార్జున యుద్ధం , దేవదాస్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అయినప్పటికీ జెర్సీ చిత్రానికి మాత్రం మంచి బిజినెస్ జరిగింది . దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ నటించిన ఈ చిత్రంలో బహుభాషా నటుడు సత్యరాజ్ కూడా కీలక పాత్రలో నటించాడు .

జెర్సీ బిజినెస్ ఏరియాల వారిగా ఇలా ఉంది .

 

నైజాం + వైజాగ్ – 10 కోట్లు

సీడెడ్ – 3. 20 కోట్లు

కృష్ణా – 1. 45 కోట్లు

గుంటూరు – 1. 80 కోట్లు

ఈస్ట్ – 1. 60 కోట్లు

వెస్ట్ – 1. 25 కోట్లు

నెల్లూరు – 80 లక్షలు

కర్ణాటక – 2 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 50 లక్షలు

ఓవర్ సీస్ – 4 కోట్లు

మొత్తం – 26 . 60 కోట్లు