నాని మార్కెట్ అక్కడే ఆగిపోయిందా?Nani Gang Leader
Nani Gang Leader

న్యాచురల్ స్టార్ నాని.. అందరి హీరోల ఫ్యాన్స్ ఇష్టపడే హీరో. నానికి యాంటీ ఫ్యాన్స్ దాదాపు ఉండరనే చెప్పాలి. ఫ్యామిలీస్ కి నాని అంటే మక్కువ ఎక్కువ. ఎక్కువగా డీసెంట్ హిట్లు కొట్టే నానితో సినిమా అంటే నిర్మాతలకు కూడా రిస్క్ తక్కువే. అయితే ఇవన్నీ పక్కనపెడితే నానికి మార్కెట్ స్తంభించినట్లుగా అనిపిస్తోంది. గత కొన్ని చిత్రాలుగా అతని వసూళ్లు చూస్తుంటే ఈ వాదన నిజమే అనిపించక మానదు.

నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం మొదటి రోజు 4 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నాని మార్కెట్ చూసుకుంటే ఇది డీసెంట్ ఓపెనింగ్ అనొచ్చు. అయితే నాని గత నాలుగు చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం.

జెర్సీ- 4 కోట్ల 50 లక్షలు

దేవదాస్- 4 కోట్ల 61 లక్షలు

కృష్ణార్జున యుద్ధం- 4 కోట్ల 58 లక్షలు

నేను లోకల్ – 4 కోట్ల 45 లక్షలు

నిన్ను కోరి- 4 కోట్ల 59 లక్షలు

ఈ చిత్రాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ చూస్తుంటే ఒకటి స్పష్టం. నాని సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా డీసెంట్ అమౌంట్ రాబట్టగలవు. మరొకటి కూడా అర్ధమవుతుంది. గత నాలుగైదు చిత్రాలుగా నాని మార్కెట్ పెరగట్లేదు. 5 కోట్ల లోపే ఆగిపోయాడు. ఈ విషయంపై నాని సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన కన్నా వెనకాల వచ్చిన హీరోలు తనను దాటి ముందుకు ఎప్పుడో వెళ్లిపోయారు.