నాని కొత్త మూవీ టైటిల్ ఇదే!


నాని కొత్త మూవీ టైటిల్ ఇదే!
నాని కొత్త మూవీ టైటిల్ ఇదే!

నేచుర‌ల్ స్టార్ నాని 28వ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా చిత్రాల ఫేమ్ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం శుక్ర‌వారం అధికారికంగా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ని ఈ నెల 21న ప్ర‌క‌టించ‌బోతున్నారు.

ఈలోగానే టైటిల్ బ‌య‌టికి వ‌చ్చేసింది. డిఫ‌రెంట్ క్యారెక్ట‌రైజేష‌న్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రానికి `అంటే సుంద‌రానికి..` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. ఫ‌స్ట్ ఫిల్మ్ మెంట‌ల్ మ‌దిలో.., రెండ‌వ చిత్రానికి `బ్రోచే వారెవ‌రురా` వంటి విభిన్న‌మైన టైటిల్స్‌ని సెట్ చేసి ఆక‌ట్టుకున్న వివేక్ ఆత్రేయ త‌న థ‌ర్డ్ మూవీకి కూడా అదే పంథాలో `అంటే సుంద‌రానికి` అనే టైటిల్‌ని అనుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది.

సుంద‌రానికి తొందెరెక్కువ అని మాట చాలా పాపుల‌ర్ అయిన డైలాగ్‌. అదే అంశాన్ని తీసుకుని నాని క్యారెక్ట‌ర్‌ని ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ డిజైన‌ఖ చేశార‌ట‌. కాన్సెప్ట్ ప్ర‌కార‌మే ఈ చిత్రానికి `అంటే సుంద‌రానికి..` అనే టైటిల్‌ని అనుకుంటున్నార‌ట‌. క‌న్ఫ్యూజ‌న్ కామెడీ నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంద‌‌ని తెలుస్తోంది. ఈ  మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని ఈ నెల 21న మేక‌ర్స్ వెల్ల‌డించ‌నున్నారు.