నాని సినిమా పాన్ ఇండియా స్థాయిలో వుంటుందా?

నాని సినిమా పాన్ ఇండియా స్థాయిలో వుంటుందా?
నాని సినిమా పాన్ ఇండియా స్థాయిలో వుంటుందా?

నేచుర‌ల్ స్టార్ నాని  హీరో సుధీర్‌బాబుతో క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `వి`. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేశారు. అనూహ్యంగా క‌రోనా ప్ర‌బ‌ల‌డంతో విడుద‌ల వాయిదా వేశారు. ఈ సినిమాతో పాటు నాని శ్యామ్ సింగ్‌రాయ్‌` చిత్రాన్ని ఓకే చేసిన విష‌యం తెక‌లిసిందే.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `ట్యాక్సీవాలా` చిత్రాన్ని రూపొందించి తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని సొంతం చేసుకున్న రాహుల్ సంక్రీత్య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లుక్‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు.

పిరియ‌మాడిక్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌పైకితీసుకురానున్నార‌ట‌. ఈ చిత్రం కోసం హీరో నాని సిక్స్ ప్యాక్ చేస్తున్నార‌ట‌. లాక్‌డౌన్ టైమ్‌ని అందుకు బాగా వినియోగించుకుంటున్నార‌ట. నీర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫీ, ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నార‌ని,  చిత్ర బృందం వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది.