
నేచురల్ స్టార్ నాని యాక్షన్ థ్రిల్లర్ `వి` తరువాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌ని పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం `టక్ జగదీష్` చిత్రంలో నటిస్తున్న నాని ఈ మూవీతో పాటు `బ్రోచే వారెవరురా` ఫేమ్ వివేక్ ఆత్రేయతో `అంటే .. సుందరానికి..` అనే ఓ అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ని చేయబోతున్న విషయం తెలిసిందే. `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
`శ్యామ్ సింగరాయ్` పేరుతో రూపొందనున్న ఈ మూవీకి వెంకట్ బోయినపల్లి నిర్మాత. సాయి పల్లవి, `ఉప్పెన` ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు. 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా హీరో నాని ఈ మూవీలో ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నారు. పిరియాడిక్ మూవీగా రూపొందనున్న ఈ మూవీ అంతా కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కనుందట.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీ గురువారం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పాన్ ఇండిమా స్థాయిలో తెరకెక్కనున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించబోతున్నారు. సంజూ జాన్ వర్గీస్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.