ఇద్ద‌రు భామ‌ల‌తో నేచుర‌ల్ స్టార్ కోల్‌క‌తా టూర్‌?

ఇద్ద‌రు భామ‌ల‌తో నేచుర‌ల్ స్టార్ కోల్‌క‌తా టూర్‌?
ఇద్ద‌రు భామ‌ల‌తో నేచుర‌ల్ స్టార్ కోల్‌క‌తా టూర్‌?

నాచుర‌ల్ స్టార్ నాని స్పీడు పెంచారు. ఒకేసారి వ‌రుస‌గా మూడు చిత్రాల్ని ప‌ట్టాలెక్కించారు. ట‌క్ జ‌గ‌దీష్‌, శ్యామ్ సింఘ‌రాయ్‌, `అంటే.. సుంద‌రానికి..` ఈ మూడు చిత్రాలు దేనిక‌దే భిన్న‌మైన క‌థా, క‌థ‌నాల‌తో సాగేవే. ఈ మూడు చిత్రాల్లో మ‌రీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిత్రం `శ్యామ్ సింఘ‌‌రాయ్‌`. ఈ చిత్రాన్ని `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కిస్తున్నారు.

వెంక‌ట్ బోయిన్‌ప‌ల్లి అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి, `ఉప్పెన‌` ఫేమ్  కృతిక శెట్టి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీలో హీరో నాని కంప్లీట్‌గా స‌రికొత్త మేకోవ‌ర్‌తో క‌నిపించ‌బోతున్నాడు. కోల్‌క‌తా నేప‌థ్యంలో ఈ మూవీ సాగ‌నుంది. ఇందు కోసం చిత్ర బృందం, ఇద్ద‌రు హీరోయిన్‌ల‌తో క‌లిసి హీరో నాని శుక్ర‌వారం కోల్‌క‌తా వెళుతున్నారు.

అక్క‌డే కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీకరించ‌బోతున్నార‌ట‌. `ప్రేమ‌మ్‌` ఫేమ్ మడోన్నా సెబాస్టియ‌న్ కూడా ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో నాని 70 ఏళ్ల ముస‌లి వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇందు కోసం ప్ర‌త్యేకంగా మేక‌ప్‌ని ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. కొంత ప్ర‌జెంట్‌.. కొంత పిరియాడ్ నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌నుంద‌ని తెలిసింది.