వెండితెర డైరెక్టర్ అవుతున్న నాని సోదరి


హీరో నాని సోదరి దీప్తి గంటా వెండితెర మీద తన దర్శకత్వ ప్రతిభ నిరూపించుకోవడానికి సిద్ధం అవుతోంది . ఇటీవలే 15 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం కు దర్శకత్వం వహించింది . ఆ షార్ట్ ఫిలిం కు అందరి నుండి ప్రశంసలు లభిస్తుండటంతో దీప్తి తో పాటుగా నాని కూడా చాలా సంతోషంగా ఉన్నారు . ఇంతకీ నాని సోదరి డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఏంటో తెలుసా …….. అనగనగా ఒక నాన్న .

ఫాదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ షార్ట్ ఫిలిం ని రిలీజ్ చేసారు . ఈ షార్ట్ ఫిలిం కు నాని నిర్మాతగా వ్యవహరించాడు . తన చెల్లి డైరెక్టర్ అయితే తనకు మరింత అడ్వాంటేజ్ అని భావించడమే కాకుండా ఆమెకు ఆసక్తి ఉండటంతో ఎంకరేజ్ చేస్తున్నాడు నాని . ఇక ఇప్పటికే నాని సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసాడు . అందులో తన చెల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .