హీరో నాని ప‌ర్ఫెక్ట్ ప్లాన్ అదిరిందిగా!


హీరో నాని ప‌ర్ఫెక్ట్ ప్లాన్ అదిరిందిగా!
హీరో నాని ప‌ర్ఫెక్ట్ ప్లాన్ అదిరిందిగా!

లాక్‌డౌన్‌కి ముందు ప్ర‌తీ హీరో ఓ ప్లాన్‌ని రెడీ చేసుకున్నారు. ఎప్పుడు ఏ మూవీని స్టార్ట్ చేయాలి.. ఏ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ క‌రోనా ఆ ప్లాన్‌ని తారుమారు చేసింది. షూటింగ్‌.. రిలీజ్‌ల విష‌యంలో ప్లాన్ మార్చుకునేలా చేసింది. హీరో నాని కూడా త‌న సినిమాల విష‌యంలోనూ ఇదే త‌ర‌హాలో ప్లాన్ చేసుకున్నారు. సుధీర్‌బాబుతో క‌లిసి న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకుకావాల‌నుకున్నారు.

కానీ లాక్‌డౌన్ కార‌ణంగా ఆ ప్లాన్ మారింది. థియేట‌ర్ల‌లో మాత్ర‌మే విడుద‌ల చేయాలని భావించిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి అంగీక‌రించాడు. అనుకున్న స్థాయిలో `వి` ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో వెంట‌నే `ట‌క్ గ‌జ‌దీష్‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. జ‌న‌వ‌రి లేదా ఏప్రీల్‌లో ఈ మూవీని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాడు. ఇక విభిన్న‌మైన క‌థాంశంతో రూపొంద‌నున్న `శ్యామ్ సింగ రాయ్‌` చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో ప్రారంభించాల‌ని పక్కా ప్ర‌ణాళిక‌ని సిద్ధం చేశాడ‌ట‌.

ఈ మూవీకి నిర్మాత మారిన విష‌యం తెలిసిందే. వెంక‌ట్ బోయినప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించ‌య‌బోతున్నారు. జూన్ లేదా జూలై నాటికి రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ రెండు చిత్రాల‌తో పాటు తాజాగా మ‌రో సినిమాని కూడా నాని ఓకే చేసిన విష‌యం తెలిసిందే. `బ్రోచేవారెవ‌రురా` ఫేమ్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి `అంటే.. సుంద‌రానికి..` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. అడ‌ల్ట్ కామెడీ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నానికి జోడీగా మ‌ల‌యాళ న‌టి న‌జ్రియ ఫ‌హాద్ న‌టించ‌నుంది. లాక్‌డౌన్ త‌న ప్లాన్‌ని తారుమారు చేసినా నాని మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో దూసుకుపోతున్నారు. నాని ప్లాన్ చూసిన వాళ్లంతా ప్లాన్ అదిరిందిగా అంటున్నారు.