నేచుర‌ల్‌స్టార్ `ట‌క్ జ‌గ‌దీష్` షురూ!


నేచుర‌ల్‌స్టార్ `ట‌క్ జ‌గ‌దీష్` షురూ!
నేచుర‌ల్‌స్టార్ `ట‌క్ జ‌గ‌దీష్` షురూ!

`జెర్సీ` నుంచి నేచుర‌ల్ స్టార్ నాని కొత్త బాట‌ప‌ట్టారు. బ‌యోపిక్ త‌ర‌హా సినిమాతో అత్యంత స‌హ‌జ‌త్వ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న నాని వ‌రుస‌గా కొత్త త‌ర‌హా చిత్రాల్ని లైన్‌లో పెట్టారు. `వి`లో విల‌న్ త‌ర‌హా పాత్ర‌లో కనిపించ‌బోతున్న నాని `ట‌క్ జ‌గ‌దీష్` అంటూ మ‌రో వినూత్న చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. `మ‌జిలి` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో విభిన్న‌మైన పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతున్నారు.

శివ నిర్వాణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైంది నాని న‌టంచిన `నిన్ను కోరి` చిత్రంతోనే అన్న‌ది తెలిసిందే. మ‌రో సారి ఈ ఇద్ద‌రు క‌లిసి సినిమా చేస్తుండ‌టంతో ఈ చిత్రంపై చిత్ర వ‌ర్గాల‌తో పాటు, ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు నెల‌కొన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యాన‌క్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నానికిది 26వ చిత్రం కావ‌డం విశేషం.

ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వ‌గా, న‌వీన్ యెర్నేని కెమెరా స్వీఛాన్ చేశారు. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం కానుంది.