టక్ జగదీష్ టీజర్ డేట్ చెప్పేసిన నాని

Nanis tuck jagadish teaser is out
Nanis tuck jagadish teaser is out

న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో  ఎక్కువ బ్రేక్ లేకుండా వరసగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. గతేడాది వి విడుదలైన తర్వాత నాని నటిస్తోన్న చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అలాగే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నారు.

ఇక నాని పుట్టినరోజు సందర్భంగా టక్ జగదీష్ టీజర్ ను ఈ నెల 23న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. 24న నాని పుట్టినరోజు జరుపుకుంటోన్న విషయం తెల్సిందే.

శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు కాగా షైన్ స్క్రీన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇంకోసారి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అన్న విషయం తెల్సిందే.