నాని ఆ రెండు సినిమాల ప‌రిస్థితేంటి?



నాని ఆ రెండు సినిమాల ప‌రిస్థితేంటి?
నాని ఆ రెండు సినిమాల ప‌రిస్థితేంటి?

నేచుర‌ల్ స్టార్ నాని జ‌డ్జిమెంట్‌కు ఓ లెక్కుంది. అది ఆయ‌న చేసిన సినిమాల‌ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ మంచి క‌థ‌ల్ని, జ‌నం మెచ్చే క‌థ‌ల్ని మాత్ర‌మే ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారాయ‌న‌. `జెండాపై క‌పిరాజు` స‌మ‌యంలో గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్న నాని ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా మ‌ళ్లీ అలాంటి త‌ప్ప‌ట‌డుగులు వేయ‌గం లేదు.

అయితే ఆయ‌న నిర్మాత‌గా చేసిన చిత్రాలు ఆయ‌న‌కు ఇబ్బందిగా మారాయ‌ని తెలుస్తోంది. నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా మారిన విష‌యం తెలిసిందే. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌ని స్థాపించి తొలి ప్ర‌య‌త్నంగా `అ!` చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విభిన్న చిత్రంగా ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకుందే కానీ క‌మ‌ర్ష‌య‌ల్‌గా మాత్రం లాభాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయింది.

ఈ సినిమా త‌రువాత నాని చేసిన మ‌రో ప్ర‌యోగం `హిట్‌`. కొత్త త‌ర‌హా క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో విశ్వ‌క్‌సేన్ హీరోగా రూపొందిన చిత్ర‌మిది. డిఫ‌రెంట్ అటెమ్ట్ అంటూ ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రానికి ఓ స‌మ‌స్య వెంటాడుతోంది. హిట్ అనిపించుకున్నా అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవ‌లే రిలీజ్ చేసినా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ మాత్రం ఏ ఛానెల్‌కి అమ్మలేదంట‌. `అ!` ప‌రిస్థితి కూడా అంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇంకా నాని వ‌ద్దే వున్నాయని. ఇప్పుడు అవి స‌మ‌స్య‌గా మారాయ‌ని అంటున్నారు.