మార్చ్ 25 న నాని “వి”

Nani V Movie Release date
Nani V Movie Release date

అష్టా చమ్మా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు “నాని” ని పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇప్పుడు మళ్లీ ఆయనతో “వి” అనే సినిమా చేస్తున్నారు. అష్టాచమ్మా తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నివేద థామస్ అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశేషమేమిటంటే,  మరొక హీరో సుధీర్ బాబు నటిస్తున్నాడు. సుధీర్ బాబు ఇదివరకు టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ సినిమా లో విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో విలన్ పాత్రలు రెండు ఒకదానికొకటి పోటాపోటీగా ఉన్నట్లు తెలుస్తోంది.

నాని ఎంత అద్భుతమైన నటుడు మనందరికీ తెలిసిన విషయమే ఇక ఆయన విలన్ తరహా పాత్ర ఇందులో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి “విలన్ లా కనిపించే హీరో” తో “హీరో లా కనిపించే విలన్” ఆడే ఒక ఆటలాగా ఈ సినిమాను మనం ఊహించవచ్చు.  ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే లాక్ చేశారు మార్చ్ 25న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. దిల్ రాజు గారి సినిమా కాబట్టి రిలీజ్ డేట్ కి డోకా ఉండదు ఇక తెరమీద నాని సుధీర్ బాబు ల నటనకు, ఇంద్రగంటి మోహనకృష్ణ మాస్టర్ స్క్రీన్ ప్లే తోడైతే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.